News

జాతి నిర్మాణంలో మీడియాకు ప్రత్యేక పాత్ర : దత్తాత్రేయ హోసబళే

218views

ఉత్తరాఖండ్ లోని దేవ సంస్కృతి విశ్వవిద్యాలయంలో జాతి నిర్మాణంలో మీడియా పాత్ర అన్న అంశంపై సెమినార్ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మీడియా బలమైన పాత్ర పోషించాలని, జాతి నిర్మాణంలో మీడియాకు ప్రత్యేక పాత్ర వుందన్నారు. స్వాతంత్రోద్యమ సమయంలోనూ స్వాతంత్ర సమరయోధులు అనేక పత్రికలను నడిపాలని, వీటి ద్వారా ప్రజల్లో మంచి అవగాహన తీసుకొచ్చారని గుర్తు చేశారు.

పాత్రికేయులు ప్రతి ఒక్కరూ నిజాయితీగా తమ బాధ్యతలను నిర్వర్తించాలని, సామాజిక సాధికారత, మహిళా సాధికారత విషయంలో తమ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించి, చైతన్యం తీసుకురావాలని సూచించారు.జాతి నిర్మాణంలో మీడియా బలమైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

ss2
డాక్టర్ చిన్మయ్ పాండ్యా తన అధ్యక్ష ప్రసంగంలో మాట్లాడుతూ జర్నలిస్టులు సున్నితంగా ఉండాలని, సమాజం మరియు దేశం యొక్క అభివృద్ధికి సహాయపడే వార్తలను మాత్రమే వ్యాప్తి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే అభద్రత, అన్యాయం, అవినీతి బాగా వ్యాపించాయని, వాటిని మూలాల నుంచి నిర్మూలించాలన్నారు.

ప్రాచ్యం స్టూడియోస్ సీఈఓ ప్రవీణ్ చతుర్వేది, సుదర్శన్ ఛానల్ ఎడిటర్-ఇన్-చీఫ్ సురేష్ చావ్హంకే, మాజీ సమాచార కమిషనర్ ఉదయ్ మహుర్కర్, మాజీ రాజ్యసభ సభ్యుడు తరుణ్ విజయ్ కూడా మీడియా పాత్రపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.