News

పహల్గాం తరహాలో పాక్‌ మళ్లీ దాడి చేయవచ్చు

165views

భారత్‌తో నేరుగా తలపడేంత సామర్థ్యం పాకిస్థాన్‌కు లేదని, కానీ అది పహల్గాం తరహాలో మరో దాడికి యత్నించవచ్చని వెస్టర్న్‌ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ కుమార్‌ కటియార్‌ పేర్కొన్నారు. అలాంటి ప్రయత్నాలు కనుక జరిగితే.. ఆపరేషన్‌ సిందూర్‌ 2.0 మరింత భయానకంగా ఉంటుందని హెచ్చరించారు. జమ్మూలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్తులో పాకిస్థాన్‌ పహల్గాం తరహా దాడులు చేస్తుందా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. పాక్‌ ఆలోచనల్లో మార్పు వచ్చేంత వరకూ అలాంటి దుశ్చర్యలను కొనసాగిస్తుందని అభిప్రాయపడ్డారు.