
159views
మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన చంద్రకళా బాయి (78), ప్రభు అప్పా (80) దంపతుల పాల వ్యాపారం రెండు గేదెలతో మొదలై నేడు డెయిరీ స్థాయికి విస్తరించింది. నిర్విరామంగా 40 ఏళ్లకు పైగా పడ్డ కష్టానికి ఈరోజు తగిన ప్రతిఫలం పొందుతున్నారు. నాందేడ్ జిల్లావ్యాప్తంగా మంచి పేరున్న ‘ప్రభు దూద్ డెయిరీ’ బాధ్యతను ఇప్పుడు కొత్త తరానికి అప్పగించారు. అయినప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా, ఇప్పటికీ ప్రభు దంపతులు శ్రమిస్తూనే ఉన్నారు. ఈ డెయిరీ ఫామ్‌లో ముర్రా, జాఫర్, పంధర్ పురి, సోలాపురి జాతుల గేదెలు 70 దాకా ఉన్నాయి. తొమ్మిదెకరాల విస్తీర్ణంలో ఉన్న డెయిరీ ఆవరణలోనే పశువుల మేత పండిస్తారు. రోజుకు దాదాపు 500 లీటర్ల పాలను అమ్ముతున్నారు. పన్నీర్, కోవా వంటి ఉత్పత్తుల విక్రయంతో అదనపు ఆదాయం ఉంటుంది.





