
అయోధ్యలో ఈ సంవత్సరం జరిగే దీపోత్సవంలో పవిత్ర సరయు నది వెంబడి 28 లక్షల మట్టి దీపాలను వెలిగించనున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది, ఇది ఒకేసారి వెలిగించే దీపాల సంఖ్యలో కొత్త ప్రపంచ రికార్డును నమోదు చేయనుంది. వారు ప్రకటించిన దాని ప్రకారం…ఈ సంవత్సరం దీపోత్సవ వేడుకల సందర్భంగా వెలిగించవాల్సిన దీపాల సంఖ్యను మరింతగా పెంచారు. అంతేకాక దీపోత్సవం సందర్భంగా అయోధ్య సాంస్కృతిక వైభవం, ఆధ్యాత్మిక సారాన్ని ప్రదర్శించడం అనే థీమ్ కి ప్రాధాన్యత ఇవ్వబడింది.
గత సంవత్సరం, 25 లక్షలకు పైగా దీపాలు ఘాట్లను వెలిగించాయి,. ఈ సంవత్సరం ఆ రికార్డును అధిగమించడమే కాకుండా అయోధ్యను భక్తి ,ఐక్యతకు నిలయంగా మార్చడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. దీపావళికి కొన్ని రోజుల ముందు, అక్టోబర్ 19న దీపోత్సవ్ 2025 వేడుకలు జరగనున్నాయి. 14 సంవత్సరాల వనవాసం తర్వాత రావణుడిపై రాముడు సాధించిన విజయానికి గుర్తుగా, అలాగే సీతాసహిత శ్రీరాముడు, లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చినందుకు గుర్తుగా ఈ వేడుకలు జరుగుతాయి.
2025 సంవత్సరానికి ప్రభుత్వం 28 లక్షల దీపాలను వెలిగించాలని నిర్దేశించింది. సరయూ నదీ తీరం వెంబడి ఉన్న 56 ఘాట్లలో ఈ దీపాలను వెలిగించనున్నారు. దీపోత్సవ చరిత్రలో తొలిసారిగా, లక్ష్మణ్ కిలా ఘాట్ ప్రకాశవంతమైన ప్రకృతి దృశ్యంలో భాగం కానుంది. అధికారుల ప్రకారం, ఈ ఘాట్ 1.25 లక్షల దీపాలతో అలంకరించబడుతుందితర కీలక ఘాట్లు కూడా అద్భుతమైన దీపాలను వెలిగించనున్నారు, రామ్ కీ పైడి , చౌదరి చరణ్ సింగ్ ఘాట్ల వద్ద ఒక్కొక్కటి 1.5 లక్షల దీపాలు, భజన్ సంధ్యా ఘాట్ వద్ద మరో 1.5 లక్షల దీపాలు వెలిగించనున్నారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు రామ్ కీ పైడి, ఇక్కడ 15 నుండి 16 లక్షల దీపాలు ఇక్కడ వెలుగనున్నాయి. అపురూపమైన ఈ దీపోత్సవం లక్షలాది మంది భక్తులను , సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుందని భావిస్తున్నారు.





