
162views
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో తొలి మహిళా ఫ్లైట్ ఇంజినీరుగా ఇన్‌స్పెక్టర్ భావనా చౌదరి నియమితులయ్యారు. బీఎస్ఎఫ్‌లో విమాన విభాగం 1969లో ఏర్పాటు కాగా, ఇంజినీరు పదవిలో మహిళను నియమించడం ఇదే ప్రథమం. నలుగురు పురుషులతో పాటు శిక్షణ పొందిన భావనకు ఇటీవలే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి ఫ్లయింగ్ బ్యాడ్జెస్‌ను అందజేశారు.





