
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రార్థన సంఘ్ సమిష్టి సంకల్పమని, 1939 నుంచి స్వయంసేవకులు నిత్య శాఖలో ప్రార్థన ద్వారా ఈ సంకల్పాన్ని పఠిస్తున్నారని సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.చాలా సంవత్సరాలుగా పఠించడం వల్ల, సాధన ద్వారా ఈ ప్రార్థన ఒక మంత్ర శక్తిని పొందిందని, అయితే ఇది కేవలం చెప్పవలసిందే కాదు, నేరుగా అనుభూతి చెందాల్సిందేనని స్పష్టం చేశారు.
నాగపూర్ లో జరిగిన అత్యాధునిక సంగీతంతో కూడిన భారతీయ భాషలలో అర్థ అనువాదాలతో కూడిన సంఘ ప్రార్ధథన వినూత్న ఆడియోను విజువల్ ప్రదర్శనను మోహన్ భాగవత్ ప్రారంభించారు. దీనిలో ప్రముఖ సంగీత దర్శకుడు రాహుల్ రాణడే, ప్రఖ్యాత గాయకుడు శంకర్ మహదేవన్ కూడా పాల్గొన్నారు.
రేషింబాగ్ స్మృతి భవన్ కాంప్లెక్స్‌లోని మహర్షి వ్యాస్ ఆడిటోరియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, సరసంఘచాలక్ సంఘ ప్రార్థన చరిత్ర మరియు ప్రభావాన్ని వివరించారు.
సంఘ్ ప్రార్థన యావత్ హిందూ సమాజం కలిసి సాధించాల్సిన లక్ష్యాన్ని వ్యక్తం చేస్తుందని వివరించారు. ఇందులో భారత మాత ప్రార్థన కూడా వుందని, ముందుగా భారత మాతకే నమస్కారం వుంటుందని, ఆ తర్వాతే ఈశ్వరునికి వుంటుందని తెలిపారు. అయితే ఈ ప్రార్థనలో భారత మాతను ఎలాంటి కోరిక కోరడం వుండదని, బదులుగా ఆమెకు ఏమి సమర్ఫణగా ఇవ్వాలో అది వుంటుందని వివరించారు. అయితే ఏది అడగాలన్న విషయంలో ఈశ్వరుడ్ని అగడం వుంటుందని వివరించారు.
సంఘ్ లో బాల, శిశు స్వయంసేవకులు కూడా వున్నారని, మరి వారు ప్రార్థనను ఎలా అర్థం చేసుకుంటారు? అయితే వారికి అర్థం కాదని కాదు. వారికి పదాలు, వాటికి అర్థాలు అర్థం కాకపోవచ్చు కానీ ప్రార్థన అనేది ఓ భావోద్వేగం అని అన్నారు. ఏ శాఖలో అయినా శిక్షక్ కి కాస్త బాల స్వయంసేవక్ తో ఇబ్బందులు వుంటాయని కానీ.. ప్రార్థన సమయం వచ్చే సరికి మాత్రం ఆ బాల స్వయంసేవక్ దక్ష మరియు ప్రణామ్ స్థితికి లోకి వచ్చేస్తారని పేర్కొన్నారు. దోమలు కుట్టినప్పటికి కూడా తన చేతిని ప్రణామ్ భంగిమలోనే వుంచి, మరో చేతిని వాడతాడని తెలిపారు.
ప్రార్థన మొదటి రూపం అనుభూతి. అందులో మాతృభూమి పట్ల దృఢ సంకల్పం, ప్రేమ, భక్తి కనిపిస్తాయని అన్నారు. అయితే.. భావాలను అర్థం చేసుకోవడానికి పెద్ద పాండిత్యం ఏమీ అవసరం లేదని అన్నారు. యావత్ హిందూ సమాజం సమిష్టి శక్తి దోహదపడినప్పుడే భారత మాత అత్యున్నత కీర్తిని పొందుతుందని సంఘ్ విశ్వసిస్తుందని వివరించారు. ఇది జరగాలంటే మొదట అనుభూతి, ఆ తర్వాత అర్థం, ఆ తర్వాత మాటల ప్రవాహం వస్తుందని వివరించారు. కానీ వేగాన్ని పెంచాలంటే మాత్రం పదాల నుంచి అర్థానికి, అర్థం నుంచి అనుభూతికి కూడా వెళ్లొచ్చన్నారు.
ఈ సందర్భంగా మోహన్ భాగవత్ ఓ ఉదాహరణను ఉటంకిస్తూ… ‘‘ఓ ప్రాథమిక పాఠశాల సంస్కృత అధ్యాపకుడు మార్గ మధ్యంలో వెళ్తున్నాడు. అప్పుడు కొన్ని శబ్దాలు అతనికి వినిపించాయి. దాని పదాలు, అర్థం అతడ్ని ఎంతో ఆకట్టుకుంది. ఉత్సాహంతో ఆయన ఆ పిల్లల దగ్గరికి వెళ్లి అడిగితే..మేము స్వయంసేవకులం. ఇది మా ప్రార్థన అని చెప్పారు. ప్రార్థనా ప్రభావంతో ఆ ఉపాధ్యాయుడు శాఖకి రావడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆయన బెంగాల్ ప్రాంత సంఘచాలక్ కూడా అయ్యారు. ఆయనే కేశవచంద్ర చక్రవర్తి’’ అని గుర్తు చేశారు.
mohan ji23
అందుకే ఈ ప్రవాహం కూడా ప్రారంభం కావాలని, ఈ కార్యక్రమం ఇందుకు ఓ సాధనం అని తెలిపారు. సంగీతంలో పదాలు, అర్థం, భావోద్వేగం. ఈ మూడు అంశాల కలయిక చాలా అరుదుగా వస్తుందన్నారు. తాను ఈ ట్రాక్ మొదటి సారి విన్నప్పుడు అది ప్రార్థనను ఆ వాతావరణంలోకి తీసుకెళ్తుందని వెంటనే గ్రహించానని అన్నారు. ఇది ఎంతగా వ్యాపిస్తే అంతగా కొత్త వ్యక్తులు సంఘ్ తో కనెక్ట్ అవుతారని, సంగీతానికి సొంత శక్తి వుందని, అది చెవుల ద్వారా నేరుగా మనస్సులోకే ప్రవేశిస్తుందని మోహన్ భాగవత్ వివరించారు.





