News

మహాచండి దేవి అలంకారంలో దుర్గమ్మ

147views

ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి అయిన బెజవాడ కనకదుర్గమ్మ పుణ్య క్షేత్రంలో దసరా మహోత్సవాలు 7వ రోజుకు చేరాయి. మహచండీ రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. దేవతల కార్యసిధ్ది, దుష్టశిక్షణ, విష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి , మహాకాళీ, మహా సరస్వతి, త్రిశక్తి రూపిణీగా శ్రీ మహాచండీ ఉద్బవించింది.. చండీ అమ్మవారిలో అనేకమంది దేవతలు కొలువైఉన్నారు.. శ్రీ మహా చండీ అమ్మవారిని ప్రార్ధిస్తే సర్వదేవతలను ప్రార్ధించినట్లే అంటున్నారు పండింతులు. అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి సంపదలు లభించి శత్రువులు మిత్రువులు మారడం ఏ కోర్కెలకోసం అయితే ప్రార్ధిస్తామో అవి సత్వరమే నెరవేరతాయనేది విశ్వాసం. శ్రీఅమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారటం, భక్తుల సంకల్పాలు నెరవేరి విజయం సిద్ధిస్తుంది.