News

ఎస్.ఎల్.భైరప్పకు ఆరెస్సెస్ సంతాపం

344views
ప్రఖ్యాతి వహించిన కన్నడ రచయిత, పద్మభూషణ్ గ్రహీత ఎస్.ఎల్. భైరప్ప మృతికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే, క్షేత్ర సంఘచాలక్ డాక్టర్ వామన్ షెనాయ్ ట్విట్టర్ వేదికగా సంతాప సందేశాన్ని రాసుకొచ్చారు.
”ప్రముఖ రచయిత, నవలా రచయిత, పరిశోధకుడు, సరస్వతి సమ్మాన్ మరియు పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ ఎస్ ఎల్ భైరప్ప మరణ వార్త తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. పర్వ, గృహభంగ, ధర్మశ్రీ, మంద్ర, భిట్టి, సార్థ, ఆవరణ వంటి అనేక రచనలలో తన ప్రత్యేకమైన రచనా శైలి ద్వారా, డాక్టర్ భైరప్ప ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన కన్నడ సాహిత్యం అభివృద్ధికి విశేష కషి చేశారు. కన్నడ సాహిత్యం ద్వారా కర్నాటక చరిత్ర, సంస్కృతి, ఆ భూమి మహాత్యాన్ని విశేషంగా పరిచయం చేశారు. మేధో రంగంలో ప్రత్యేకమైన ముద్రను వేశారు.డాక్టర్ ఎస్ ఎల్ భైరప్పకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తో చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఆయన రాష్ట్రోత్థాన సాహిత్యం, మంథన ఈవెంట్స్, మంగళూరు లిట్ ఫెస్ట్ మరియు అనేక ఇతర కార్యక్రమాలలో పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తరపున, మేము డాక్టర్ ఎస్ ఎల్ భైరప్పకు మా సంతాపం మరియు నివాళులు అర్పిస్తున్నాము. ఈ నష్టాన్ని భరించే శక్తిని ఆయన కుటుంబానికి మరియు అసంఖ్యాక అభిమానులకు ఆ సర్వశక్తిమంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఈశ్వర ప్రార్థన.’’ అని పేర్కొన్నారు.
bhirappa2
భైరప్ప భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సహ సర్ కార్యవాహ, క్షేత్ర కార్యవాహ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ సీ.ఆర్. ముకుంద, క్షేత్ర కార్యవాహ తిప్పేస్వామి బెంగళూరులో భైరప్ప భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబీకులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.