News

పండిట్ దీన్ దయాళ్ జీ ఆలోచనల ఆవిష్కరణ వేదిక విజయవాడ

260views

విజయవాడలో పండిట్ దీన్ దయాళ్ జీ జయంతి వేడుకలు నిర్వహించారు. దీన్ దయాళ్ జీ ఆలోచనల కారణంగానే దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారిని పైకి తీసుకుని రావడానికి వీలుకలుగుతోందని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి ఛీఫ్ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ జయంతి విజయవాడకు ప్రత్యేకమని పేర్కొన్నారు.విజయవాడ ఆనాటి జనసంఘ్ నేత పండిట్ దీన్ దయాళ్ జీ ఆలోచనలకు కార్యరూపం విజయవాడ కేంద్రంగానే ఆవిష్కరణ జరిగిందని తెలిపారు. 1965 డిసెంబర్ లో జనసంఘ్ సమావేశాలలో పండిట్ దీన దయాళ్ ఆలోచనలను విజయవాడలోనే ప్రకటించారు. సంఘ్ శతాబ్ది ఉత్సవాలు ఈ సంవత్సరం జరుగుతున్నాయి.1967 డిసెంబరు 28న కేలికట్ లో అఖిల భారత అధ్యక్షుడుగా పండిట్ దీనదయాళ్ జీ ఎన్నుకోబడ్డారని చెప్పారు.

భారతీయ జనసంఘ్ దేశంలో అనేక విజయాలను చవి చూసిందని దేశంలో కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పాటు కేవలం జనసంఘ్ ద్వారా వస్తుందని కాంగ్రెస్ , వామపక్షాలు ఆందోళనకు గురైన విషయాన్ని మాధవ్ ప్రత్యేకంగా వివరించారు.

ముఖ్య వక్తగా పాల్గొన్న సీనియర్ పాత్రికేయుడు రాకా సుధాకర్ మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆరోగ్యం గురించి ఇచ్చిన తాత్పర్యం లో దీనదయాళ్ ఇచ్చిన అంశాన్నే చెప్పింది. ప్రకృతి ఆరాధన మన జీవితంలో అంతర్భాగం వ్యక్తి నుంచి సమాజం.. సమాజం బాగుండాలనేది దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచన.. అభివృద్ధి కార్యక్రమాలు మన దేశంలో విదేశాల ఆలోచనతో వస్తున్నాయి
ఆర్ధిక నిర్ణయాలు స్ధానిక పరిస్ధితుల, ప్రజల ఆలోచనల ఆధారంగా ఉండాలి. చివరి మనిషి వరకూ అభివృద్ధి చేరాలి.అంత్యోదయ పధకాన్ని రాజస్థాన్ లో మొదట తీసుకొచ్చారని తెలిపారు.

దీనదయాల్ ఉపాధ్యాయ ఆలోచన ఆధారంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోందని, ఆత్మ నిర్భర్ భారత్ కు దీనదయాళ్ ఉపాధ్యాయ ఇచ్చిన విధానమే మోదీ వినియోగిస్తున్నారని భాగవతంలో ఒక వ్యక్తి సంపాదన ఏవిధంగా వ్యయం చేయాలన్న విషయాన్ని వివరించడం జరిగిందని అదే ఆలోచన పండిట్ దీన్ దయాళ్ ప్రవచించారని వివరించారు.