
ముంబైలోని గోవంటి ప్రాంతంలోని అన్నాభావు సాథే నగర్ లో నవరాత్రి సందర్భంగా దుర్గా విగ్రహాన్ని తరలిస్తుండగా ఒక మసీదు వద్ద దుర్గా విగ్రహాన్ని ముస్లింలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. దుర్గాదేవి విగ్రహాన్ని తీసుకెళ్తుండగా అది విరిగిపోయి కనిపించిందని, ఇది వివాదం మరియు ఉద్రిక్తతకు దారితీసింది. మసీదుగుండా వెళుతుండగా కొంతమంది విగ్రహం విరిగిపోయి ఉండటాన్ని గమనించారు. దీనిపై, ఒక వర్గం రాడికల్ ముస్లింలు విగ్రహాన్ని పగలగొట్టారని ఆరోపించింది. వాదన తీవ్రమైంది ,త్వరలోనే ఘర్షణ చెలరేగింది.
ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత దృష్ట్యా, పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. పోలీసులు చెప్పినదాని ప్రకారం మసీదుగుండా విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళుతుడగా డ్రమ్స్ వాయించడంపై ముస్లింలు అభ్యంతరం తెలిపారని, ఆ సమయంలోనే వారికి చెందిన వ్యక్తులు ఎవరో దేవతా విగ్రహాన్ని ధ్వంసం చేసారని పోలీసు అధికారి తెలిపారు.
ఈ సంఘటన తర్వాత, మన్ఖుర్డ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశారు. వారిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద, మూక దాడి, శాంతికి భంగం కలిగించడం వంటి అభియోగాలు మోపారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు. సోషల్ మీడియా లేదా మరే ఇతర మాధ్యమం ద్వారా పుకార్లను వ్యాప్తి చేయడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వారు హెచ్చరించారు.





