
ప్రపంచంలోనే అతి ఎత్తైన హిందూ ఆలయాల్లో ఒకటిగా నిలవనున్న ఉమియా దేవి మందిర్ గుజరాత్ లోని జాస్ పూర్ లో సిద్ధమవుతోంది. 60 ఎకరాల్లో వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఉమియా దేవి మందిరాన్ని విశ్వ్ ఉమియా ఫౌండేషన్ నిర్మిస్తోంది. గోపురం ఎత్తు 551 అడుగులుగా చెబుతున్నారు. ఈ ఉమియా ధామం ప్రాజెక్టులో నైపుణ్య, జీవన ప్రగతి విశ్వవిద్యాలయం, ఆస్పత్రి, క్రీడల కాంప్లెక్స్ లను నిర్మిస్తున్నారు. ప్రశాంత వాతావరణంతో కూడిన సామాజిక, మత, సాంస్కృతిక కార్యకలాపాల కలబోతగా దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు విశ్వ ఉమియా ఫౌండేషన్ తెలిపింది. ఇందులో వేదాల మ్యూజియం, యోగ, ధ్యానం వంటివి చేసుకునేందుకు ప్రత్యేక నిర్మాణాలు, యజ్ఞశాల,ఆడిటోరియంలు, థియేటర్లు, రిఫ్రష్ మెంట్ జోన్లు, పార్కింగ్ ఏరియాలు, వీఐపీల కోసం గ్రీన్ హాల్స్ ఉంటాయి. కాగా ప్రపంచంలో అతి ఎత్తైన హిందూ ఆలయంగా… ఉత్తర్ ప్రదేశ్ లో వృందావన్ చంద్రోదయ మందిర్ రూపుదిద్దుకుంటోంది. 700 అడుగుల గోపురంతో ఇస్కాన్ దీన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం అతి ఎత్తైన హిందూ టెంపుల్ గా కర్ణాటకలో 249 అడుగుల మురుడేశ్వర్ ఆలయం ఉంది.





