News

వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

267views

వక్ఫ్ చట్టానికి ఇటీవల చేసిన సవరణల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు (గురువారం) విచారణ చేపట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ ఎ.జి. మసీహ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈరోజు ఈ పిటిషన్లపై విచారణను పునఃప్రారంభించింది.

వక్ఫ్ చట్టం 2025 పై సుప్రింకోర్టు మధ్యంతర తీర్పును వెలువరించింది. చట్టం అమలుపై స్టే విధించేందుకు నిరాకరిస్తూనే చట్టంలోని కీలక ప్రొవిజన్ ను నిలిపివేస్తూ ఆదేశాలను జారీ చేసింది. కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుదన్న దాన్ని నిలిపివేసింది.

ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు తయారుచేసేవరకు ఇది అమల్లో ఉండదని కోర్టు చెప్పింది. అదే సమయంలో వక్ఫ్ చట్టం 2025 పై మొత్తంగా స్టే విధించడానికి సుప్రిం కోర్టు నిరాకరించింది. కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత రక్షణ అవసరమని పేర్కొంది.. వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య కచ్చితంగా మెజార్టీగా ఉండాలని చెప్పింది. అంతేకాకుండా బోర్డు లేదా కౌన్సిల్ లో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యలు ఉండాలని కోర్టు తేల్చి చెప్పింది.