
భారత జాతీయ జెండాను అవమానించి, పాకిస్తాన్‌ను కీర్తించిన వాసిక్ బెయిల్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది.
” భారత జాతీయ జెండాను అవమానించడం చాలా ఆందోళన కలిగించే విషయం వివాదాస్పద పోస్ట్‌కు సంబంధించి నిందితుల నుండి సంతృప్తికరమైన సమాధానం రాలేదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ” అందువల్ల, రికార్డులో అందుబాటులో ఉన్న విషయాలను పరిశీలిస్తే, భారతదేశం పట్ల పిటిషనర్ భావాలు దేశభక్తితో కూడినవి కాదని, అతను ఉద్దేశపూర్వకంగా అలాంటి పోస్టును పెట్టినట్లు భావిస్తున్నామని హైకోర్టు చెప్పింది. వాసిక్ త్యాగి పోస్టులు “జాతి వ్యతిరేక భావజాలాన్ని కీర్తించడం వైపు మొగ్గు చూపుతాయి” “ప్రజా శాంతి ని భంగపరుస్తాయని ”. ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. అందుగని పిటిషనర్ను బెయిల పై విడుదల చేయబోమని స్పష్టం చేసింది.
ముజఫర్‌నగర్‌లోని చార్తవాల్ పోలీస్ స్టేషన్‌లో వాసిక్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అతను తన ఫేస్ బుక్ ఖాతాలో పాకిస్తాన్ పైలట్ కమ్రాన్ భట్టిని, ఆ దేశాన్ని ప్రశంసాంచడు. అంతేకాకుండా దేశ జాతీయ జెండా ఫోటోను ఫోటోషాప్ లో అవమానించేలా మార్ప్ చేసి దానిని తిడితూ పోస్ట్ పెట్టాడు. దీనితో పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వాసిక్ మొబైల్ నంబర్‌లో నమోదైన ఫేస్‌బుక్ ఖాతా నుండి పోలీసులు ఈ పోస్ట్‌ను దర్యాప్తు చేశారు. మెటాను కూడా సంప్రదించారు. పోస్ట్‌తో అనుబంధించబడిన ఐపీ చిరునామా వాసిక్ ఫోన్ నంబర్‌లో ఉపయోగించబడిందని సైబర్ నివేదిక రుజువు చేసింది. జూన్ 7న వాసిక్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత, అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకుని దానిపై ఫోరెన్సిక్ దర్యాప్తు కూడా జరిగింది.





