
ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించుకున్నారు. ఆస్ట్రేలియాలోని కాన్సులేట్ కార్యాలయంలో కూడా వేడుకల నిర్వహణకు సిద్ధం కాగా.. అక్కడకు వచ్చిన ఖలిస్థానీయులు రెచ్చిపోయారు.
మెల్‌బోర్న్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించేందుకు భారతీయులు కాన్సులేట్ వద్ద హాజరయ్యారు. దేశభక్తి గీతాలు పాడుతుండగా.. కొందరు ఖలిస్థానీలు చొరబడ్డారు. అనంతరం తమ జెండాలు ఊపుతూ నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని.. ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇటీవల మెల్‌బోర్న్‌లోని ఓ హిందూ ఆలయంపై గుర్తుతెలియని వ్యక్తులు విద్వేషపూరిత వ్యాఖ్యలు రాసిన సంగతి తెలిసిందే. ఆలయం గోడలపై హిట్లర్ చిత్రాన్ని ఉంచి, దానిపై ‘గో హోమ్ బ్రౌన్..’ అని రాశారు. అంతకుముందు కూడా కొందరు దుండగులు ఓ భారతీయ విద్యార్థిపై దాడి చేసి జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు.



