News

శంఖం ఊదడం ద్వారా స్లీప్ అప్నియా బాధితులకు ఉపశ మనం

203views

శంఖం ఊదడం ద్వారా స్లీప్ అప్నియా బాధితులు ఉపశ మనం పొందొచ్చని పరిశోధకులు తేల్చారు. ఇలాంటివారికి శ్వాస వ్యాయామాల కన్నా ఇదే ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుందని పేర్కొ న్నారు. రాజస్థాన్ లోని జైపుర్ కు చెందిన ఎటర్నల్ హార్ట్ కేర్ సెంటర్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిపుణులు ఈ పరిశోధన చేశారు. అబ్జెక్టివ్ స్లీప్ అప్నియా అనే ఈ రుగ్మత కారణంగా.. నిద్రించే టప్పుడు గొంతులోని కండరాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా శ్వాసకు ఇబ్బంది కలుగుతుంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయిపై కూడా ప్రభావం పడు తుంది. దీనివల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. ఫలితంగా రోజంతా అలసట, నిద్రమత్తు ఆవహిస్తుంది. తాజాగా జైపుర్ పరిశోధకులు.. ఈ రుగ్మత ఒక మోస్తరు స్థాయిలో ఉన్న 30 మందిని ఎంపిక చేశారు. ఈ వాలంటీర్లలో సగం మందికి కనీసం 15 నిమిషాల పాటు శంఖం ఊదేలా శిక్షణ ఇచ్చారు. ఆరు నెలల విరామం తర్వాత వాలంటీర్లను పరిశీలించినప్పుడు శంఖం ఊదినవారికి నిద్రబాగానే పట్టినట్లు తేలింది. వీరిలో పగటిపూట నిద్రమత్తు 34 శాతం తగ్గిందని వెల్లడైంది. అలాగే నిద్ర సమయంలో వారి రక్తంలో ఆక్సిజన్ స్థాయి కూడా మెరుగుపడి నట్లు పరిశోధకులు గుర్తించారు.