
అక్రమ మత మార్పిడి, మానవుల అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణలతో ఇద్దరు క్రైస్తవ సన్యాసినులను రాయ్ పూర్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి సంబంధమున్న, సహాయం చేస్తున్న మరో ముగ్గుర్ని కూడా అరెస్ట్ చేశారు. వీరంతా ఆగ్రా నుంచి వచ్చినట్లు తెలిసింది. క్రైస్తవ సన్యాసినులైన ప్రీతిమేరీ, వందన ఫ్రాన్సిస్ ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు ప్రకటించారు. వీరిపై భారతీయ శిక్ష్మా స్మృతి సెక్షన్ 143 కింద కేసులు నమోదయ్యాయి. మరోవైపు రక్షించబడిన బాలికలను సఖివన్ స్టాప్ సెంటర్ కి అధికారులు తరలించారు.
నిజానికి దక్షిణ బస్తర్ లోని నారాయణపూర్ జిల్లాకు చెందిన ఈ ముగ్గుర్ని బజరంగ్ దళ్ కార్యకర్తలు దుర్గ్ అనే రైల్వే స్టేషన్ లో గుర్తించారు. పట్టుకున్నారు. ఉపాధి శిక్షణ కోసం క్రైస్తవ సన్యాసినులు తమను తీసుకెళ్తున్నారంటూ ఈ ముగ్గురు చెప్పుకొచ్చారు.
అయితే ఎలాంటి కారణం లేకుండానే క్రైస్తవ సన్యాసినులు తమ దుర్గ్ ప్రాంతానికి ఓ రోజు ముందే వచ్చి వున్నారని, కొందర్ని తీసుకొని, రైలు ఎక్కుతుండగా తాము చూశామని బజరంగ్ దళ్ నేతలు చెప్పుకొచ్చారు. అయితే. .. ఇంత అడ్డంగా దొరికిపోయినా.. క్రైస్తమ సమాజానికి చెందిన కొందరు దుర్గ్ స్టేషన్ దగ్గర గుమిగూడి… క్రైస్తవ సన్యాసినులు చేస్తున్న పనిని సమర్థించారు.





