News

మనసు నియంత్రణతో విజయం సాధ్యం

274views

మనసును నియంత్రణలో ఉంచుకున్నప్పుడు విజయం సాధ్యమవుతుందని రామకృష్ణమఠం స్వామి బోధమయానందాజీ మహారాజ్‌ అన్నారు.రాజంపేటలోని అన్నమాచార్య యూనివర్సిటీలో మైండ్‌ మేనేజ్‌మెంట్‌ ఫర్‌ బెట్టర్‌ ఫ్యూచర్‌ అనే అంశంపై వ్యక్తిత్వ వికాస సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. జ్ఙానం, నియంత్రణ, ధ్యానం జీవితాన్ని గెలవడానికి మార్గం చూపుతాయన్నారు. వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ సాయిబాబారెడ్డి మాట్లాడుతూ విలువ ఆధారిత, ఆధ్యాత్మికతతో కూడిన వ్యక్తిత్వ వికాస సదస్సులు విద్యార్ధుల జీవితాల్లో కీలకంగా మారుతాయన్నారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నారాయణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి అద్భుతమైన భవిష్యత్తును కలిగి ఉండాలంటే ముందు మనస్సును క్రమబద్ధీకరించుకోవాలన్నారు. సదస్సులో అలుమ్నీ కో–ఆర్టినేటర్‌, అన్నమాచార్య రేడియో 89.6 స్టేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కాశిగారిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.