ArticlesNews

భారీ మోసానికి పాల్పడ్డ మదర్సాలు, క్రైస్తవ పాఠశాలలు

244views

మధ్యప్రదేశ్ లో మిషనరీ పాఠశాలలు, మదర్సాలు అక్కడి ప్రభుత్వాన్ని మోసం చేశాయి. 100 కి పైగా మిషనరీ పాఠశాలలు, మదర్సాలు స్కాలర్ షిప్పుల కింద 57 లక్షల భారీ మోసాన్ని చేశాయి. వారి మిషనరీ పాఠశాలల్లో, మదర్సాల్లో విద్యార్థులు లేకున్నా… విద్యార్థులు వున్నట్లు నకిలీ రికార్డులు, నకిలీ సంతకాలు.. ఇలా అన్నీ నకిలీనే. దాదాపు 40 కి పైగా పాఠశాలలు, మదర్సాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. అసలు లేని విద్యార్థులకు స్కాలర్ షిప్పులు ఇప్పించేశాయి.

ఈ విషయం బయటికి రావడంతో భోపాల్ క్రైమ్ బ్రాంచ్ ప్రాథమికంగా 23 మైనారిటీ పాఠశాలలు, 17 మదర్సాలతో పాటు మొత్తం 104 పాఠశాలల్లో దర్యాప్తును చేస్తోంది. వెనుకబడిన తరగతులు, మైనారిటీ సంక్షేమ బోర్డు జూన్ 17 న ఇదంతా బోగస్ అంటూ అధికారికంగా ఫిర్యాదు చేసింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా దర్యాప్తుకు ఆదేశించింది.

ఆస్పత్రులు, దుకాణాలు, ఖాళీ భవనాలు… మరి విద్యార్థులేరీ?
మిషనరీ పాఠశాలలు, మదర్సాలు సూచించిన చిరునామాలకి వెళ్లి అధికారులు తనిఖీలు చేపట్టారు. జహంగీరాబాద్ ప్రాంతంలో, “సిటీ మాంటిస్సోరి స్కూల్” అనే పేరున్న సైన్ బోర్డు మాత్రం వుంది. కానీ.. అక్కడికి వెళ్లి చూసే సరికి పాఠశాలే లేదు. కేవలం ఆఫీస్ లాంటి వ్యవస్థ మాత్రమే వుంది.

దీనిపై స్థానికుడొకరు స్పందిస్తూ.. ‘‘ఈ బోర్డు రెండు సంవత్సరాలుగా ఇలాగే వుంది. నేను మాత్రం ఎప్పుడూ విద్యార్థులను గానీ, ఉపాధ్యాయులను గానీ చూడనేలేదు.’’ అని వెల్లడించారు. కానీ… ఇక్కడే 29 మంది విద్యార్థులున్నారంటూ యాజమాన్యం 1.65 లక్షలు తమకు కావాలని క్లెయిమ్ చేసుకున్నాయి.

అలాగే రెండో ఉదాహరణ చూద్దాం.
బెరాసియా రోడ్డులోని బహుళ అంతస్తుల భవనంలో రెండు పాఠశాలలున్నాయి. వాటి పేరు ఎంజే. కాన్వెంట్, సెయింట్ డిసౌజా కాన్వెంట్.ఈ రెండు పాఠశాలలకూ పిల్లలు పరిమిత సంఖ్యలోనే పిల్లలు వస్తున్నారు. తమకు స్కాలర్ షిప్పులు కావాలని ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్నాయి. కానీ.. వీటి నిర్వహణ విషయంలో ఉన్నతాధికారులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎం.జె. కాన్వెంట్ యాజమాన్యం తమ వద్ద 30 మంది విద్యార్థులున్నారని 1.7 లక్షలు కావాలని అడగ్గా, సెయింట్ డిసౌజా మాత్రం ఇద్దరు విద్యార్థులకు 11,400 చొప్పున క్లెయిమ్ చేసుకుంది.అయితే.. ప్రిన్సిపాల్ పేరుతో వున్న ఫోన్ నెంబర్ కి అధికారులు ఫోన్ చేయగా… మొదట్లో తానే ప్రిన్సిపాల్ అని బుకాయించాడు. ఆ తర్వాత తాను కాదని అంగీకరించేశాడు.

అంబర్లీ కాన్వెంట్ దీ ఇదే తంతు…
తమ పాఠశాలలో 33 మంది విద్యార్థులున్నారని, 1.8 లక్షలు చెల్లించేశామని చెప్పుకొచ్చింది. కానీ అధికారులు తనిఖీలకు వెళ్లగా అక్కడ పాఠశాలే లేదు. లిల్లీ టాకీస్ దగ్గర అని చిరుమానా చెప్పగా.. వెళ్లిచూస్తే పాఠశాలకు బదులుగా ఓ ఆస్పత్రి, దుకాణాలు వున్నాయి. అసలు పాఠశాలే లేదని స్థానికులు తెగేసి చెప్పేశారు.

Madrasa Madul Uloom: Rs 1,28,200
Madrasa Dainiki Warisul Hayat, Sharda Nagar: Rs 1,09,300
Madrasa Rozi Shi Samiti, Gas Rahat: Rs 1,02,600
Madrasa Roz Badas: Rs 68,400
Madrasa Bushra Daini, 12 Kola Mohalla: Rs 62,700
Madrasa-e-Kaisar, Atal Nagar: Rs 62,700
Madrasa Al Usmania: Rs 62,700
Madrasa Asif Saeed Urdu, Hanif Colony: Rs 51,300
Madrasa Ahad Taleemul Quran: Rs 45,600
Madrasa Girls: Rs 39,900
Madrasa Gulistan-e-Hind: Rs 39,900
Madrasa Taleemul Islam: Rs 34,200
Madrasa Aiman Daini: Rs 28,500

ఈ సంస్థలు చాలా వరకూ పనిచేయడమే లేదు. లేదా సీనియర్ సెకండరీ స్థాయి నిబంధనలకు అనుగుణంగా కూడా లేవు. దీంతో మదర్సాలు ప్రభుత్వ నిధుల కోసమే ఈ నకిలీ మదర్సాలను సృష్టించారా? అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

అయితే… ఈ స్కామ్ కేవలం భోపాల్ కి మాత్రమే పరిమితం కాలేదని అధికారులు పేర్కొంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర బాలల కమిషన్ సభ్యుడు ఓంకార్ సింగ్ ప్రకారం.. ఈ అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా వుందని, మిషనరీ పాఠశాలలు, మదర్సాలు ఇలాగే క్లెయిమ్ చేసుకున్నాయని పేర్కొన్నారు.తమ దృష్టికి కూడా వచ్చిందని, ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
ఇక…. క్రైస్తవ మిషనరీ పాఠశాలలది కూడా ఇదే తంతు. సెయింట్ డిసౌజా మరియు ఎంజె కాన్వెంట్ వంటి పాఠశాలలు తమను తాము కాన్వెంట్లుగా చూపించుకున్నప్పటికీ అదే మోసపూరిత వ్యవహారాల్లో నిండా మునిగిపోయాయి.

New FR Convent School: Rs 5,45,100
Holy Field School: Rs 3,81,900
Educational Empire Convent School: Rs 3,76,200
Unity Mission School: Rs 3,70,500
TNS Public School: Rs 2,33,700
Life Convent School: Rs 2,28,000
New Life Convent School: Rs 1,65,300

తాము పాఠశాలలను నడుపుతున్నామని బుకాయిస్తూ… విద్యను బోధించాల్సింది పోయి, ప్రభుత్వ నుంచి వచ్చే డబ్బుల కోసం మాత్రమే ఆయా పాఠశాలలు చూస్తున్నాయన్నది అర్థమైపోతోంది.
మరోవైపు దీనిపై పోలీసులు కూడా రంగంలోకి దిగారు. దర్యాప్తును ప్రారంభించారు. 972 మంది విద్యార్థుల్లో ఎక్కువ మంది స్కాలర్ షిప్పు క్లెయిమ్ చేసుకునే పాఠశాలల్లో లేరని, వారి పేర్లు కూడా కనీసం నమోదు చేసుకోలేదని పోలీసులు అధికారులు పేర్కొంటున్నారు. ‘‘మేము బ్యాంకు ఖాతాలు, డాక్యుమెంటేషన్ ధ్రువీకరిస్తున్నాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని అదనపు డీసీపీ శైలేంద్ర సింగ్ ప్రకటించారు.

ఈ అవినీతి బయటికి రావడంతో మదర్సాలు, క్రైస్తవ మిషనరీ పాఠశాలల విషయంలో సవాలక్ష సందేహాలు తలెత్తుతున్నాయి. అసలు వీటి ఉద్దేశం ఏమిటి? తరుచుగా చెప్పుకుంటున్నట్లు అవి సమాజానికి నిజంగా సేవ చేస్తున్నాయా? నిధుల విషయంలో జవాబుదారీగా వుంటున్నాయా? లేదా నిధుల కోసమే పాఠశాలలు నడుపుతున్నామని వాటిని రక్షణ కవచంలా వాడుకుంటున్నాయా? అన్న సందేహాలు వస్తున్నాయి.

తాము సేవ చేస్తున్నామని, మానవత్వంతో ముందుకు సాగుతున్నామని పదే పదే చెబుతుంటాయి. ఈ పదాల ద్వారానే విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షిస్తుంటాయి. మరి లేని విద్యార్థులున్నట్లు చూపించి మోసం చేయడం దేనికి సంకేతం? వారి ఆదర్శాలకు వారే తూట్లు పొడుచుకున్నట్లు కదా. సమాజం విషయంలో వారి నిబద్ధత ఏపాటిదో అర్థమైపోతోంది.

మదర్సాల విషయంలో కూడా అంతే. మతపరమైన విద్యను, నైతిక విద్యను అందిస్తామని పదే పదే ముస్లిం పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు చేసిందేమిటి? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పిల్లల భవిష్యత్తుతో ఆటాడుకుంటున్నారని, డబ్బుల కోసం అబద్ధాలాడుతున్నారని అర్థమైపోతోంది.