
257views
రాష్ట్రంలో ఉగ్రవాదుల కదలికలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ కోరారు. కర్నూలులో నిర్వహించిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఉగ్రవాదులు దేశంలో వారికి అనుకులంగా 15 ప్రాంతాల్లో రహస్యంగా స్థావరాలు ఏర్పాటు చేసుకుంటే అందులో రాష్ట్రంలోని రాయచోటిలో ఉగ్రవాదుల కదలికలు ఉండడం ఆలోచించవలసిన విషయమని అన్నారు. ఈ ఘటనలో పూర్తి విచారణ చేసి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థుల ఉద్యోగులను వెంటనే తొలగించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న భద్రాచలం రాముడి భూములు, తెలంగాణలో ఉన్న తిరుమల దేవస్థానం భూముల అన్యాక్రాంతం అవుతుంటే ఎవరు పట్టించుకోవడం లేదని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని రావినూతల శశిధర్ కోరారు.





