News

సంస్కార భారతి ఆధ్వర్యంలో గురు సత్కారం

250views

గురు సంప్రదాయాన్ని కాపాడుకోవాలని సంస్కారభారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీవీఎన్ కృష్ణ అన్నారు. గురుపూర్ణిమ సందర్భంగా సంస్కార భారతి మహానగర్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ లోని కౌతా పూర్ణానందం కళావేదిక సాంస్కృతిక కళా ప్రదర్శనలు, వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి గురు సత్కారం శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమాలను ప్రారంభించిన పీవీఎన్ కృష్ణ మాట్లాడుతూ సంస్కార భారతి సాంస్కృతిక, కళా, సాహిత్య రంగాలకు విశేషమైన సేవలను అందిస్తుందని చెప్పారు.

సంస్కార భారతి నగర అధ్యక్షుడు పసుమర్తి భాస్కరశర్మ మాట్లా డుతూ జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు గురువన్నారు. విశ్వహిందూ పరిషత్ కోశాఖాధ్యక్షుడు వి. దుర్గాప్రసాద్, విద్యావేత్త బోని సురేష్, వేదచారిటబుల్ సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ యడ్లపాటి శేషసాయి. హైకోర్ట్ న్యాయవాది వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సాయిశంకర్, శ్రావణ్ కుమార్ నిర్వ హించారు. సంస్కారభారతి నగర బాధ్యులు పాల్గొన్నారు.

గురు పూజోత్సవం సందర్భంగా చిట్టా వెంకట ప్రసాద్ (నాటక రంగం), గండూరి శ్రీనివాసమూర్తి (సంగీతం), డాక్టర్ రామకృష్ణ (సాహిత్యం) డాక్టర్ చలికాండ ఉ షామాధవి (నృత్యం), ఎస్.ప్రభాకర మల్లిఖార్జునరావును (చిత్రలేఖనం) సత్కరించారు. సంస్కార భారతి యువ కళాకారులు ప్రదర్శించిన అంశాలు ఆకట్టుకున్నాయి.