ArticlesNews

దేశభక్తిలో విద్యార్థి శక్తి

190views

(నేడు ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం)

– డా॥ తారకేశ్వరరావు ఇప్పిలి, ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు

విద్యార్థుల శక్తిని దేశ నిర్మాణానికి వినియోగించాలన్న గొప్ప లక్ష్యంతో ఏర్పడిన ‘అఖిల భారతీయ విద్యార్థి పరిషత్’ (ఏబీవీపీ) ఈ రోజు (జూలై 9) తన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది విద్యార్థులు ఈ సంస్థ ద్వారా దేశభక్తి, జాతీయ ఐక్యత, సామాజిక బాధ్యత వంటి విలువలను అవలంబిస్తూ విద్యారం గంలో మార్పునకు ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. ప్రత్యేకంగా విద్యా నాణ్యత, ఉపా ధ్యాయ నియామకాలు, రీజనల్ యూనివర్సిటీ అభివృద్ధి; బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టల్స్, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ వంటి వివిధ అంశాల కోసం ఏబీవీపీ చేస్తున్న కృషి అసాధారణమైనది. ప్రాంతీయ సమస్యలను జాతీయ దృక్పథంతో అనుసంధానం చేసి, విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటు పడు తోంది. సమాజంలోని సాంఘిక, ఆర్థిక సమస్యలపై చర్చకు వేదికగా ఉంటూ రాజకీ యంగా బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని తయారు చేస్తోంది.

ఏబీవీపీ స్థాపనకు మూలంగా ఉన్న ఆలోచనలు స్వాతంత్ర్యానంతర భారతదేశ విద్యా, సాంస్కృతిక సామాజిక పరిస్థితులకు స్పందనగా తలెత్తినవే! 1948లో ప్రారం భమై, 1949లో ఢిల్లీలో అధికారికంగా ఆవిర్భవించిన ఈ విద్యార్థి సంస్థ ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’ (ఆర్ఎస్ఎస్) సిద్ధాంతాల ఆధారంగా అభివృద్ధి చెందింది. ‘జ్ఞానం, శీలం, ఏకత’ ఏబీవీపీ నినాదం. 2024-25 నాటికి ఈ సంస్థకు 60 లక్షలకు పైగా సభ్యులు ఉండటం యువతలో దీని పట్ల ఉన్న విశ్వాసాన్ని తెలుపుతోంది.

విద్యార్థుల సమస్యలపై చురుకుగా స్పందిస్తూ విద్యా రుసుముల నియంత్రణ, ఉద్యోగ అవకాశాల పెంపుదల, హాస్టల్ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేపట్టడం ద్వారా ఈ సంస్థ విశ్వసనీయతను పెంచుకుంది. 1983లో జరిగిన ‘సేవ్ అస్సాం’ ఉద్యమంలో భాగంగా ‘చలో గౌహతి’, 1990లో జాతీయ ఏకత్వం కోసం నిర్వహించిన ‘చలో కాశ్మీర్’ లో పాల్గొంది. ఇటీవలి కాలంలో కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ఆహారం, ఔషధాలు, ప్లాస్మా దానం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించి సేవలందించింది. ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్, ప్రముఖ పార్లమెంటేరియన్ డా. సత్యపాల్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటి నాయకులు ఈ సంస్థ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారం భించినవారే. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పీవీఎన్ మాధవ్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన రామచంద్రరావు కూడా ఏబీవీపీ నుంచి వచ్చినవారే. కులం, మతం, ప్రాంతం అనే ప్రామాణికతలకు అతీతంగా దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దే దిశగా విద్యార్థి శక్తిని ఏబీవీపీ ఉపయోగిస్తోంది.