News

శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనానికి ఆన్‌లైన్‌ టోకెన్లు

282views

శ్రీశైల శ్రీమల్లికార్జునస్వామి ఉచిత స్పర్శ దర్శనానికి ఇక నుంచి ఆన్‌లైన్‌ ద్వారా టోకెన్లు జారీ చేస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎం.శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఈ నెల 1 నుంచి పునఃప్రారంభించిన ఉచిత స్పర్శ దర్శనం అమలుపై దేవస్థానం విభాగాధిపతులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 3.45 గంటల వరకు ఈ ఉచిత స్పర్శ దర్శనం ఉంటుందని చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా.. పారదర్శకంగా ఉండేందుకు ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే టోకెన్లు జారీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

www.srisailadevasthanam.org www.aptemples.ap.gov.in వెబ్‌సైట్ల ద్వారా పేరు, చిరునామా, ఆధార్‌ నంబరు నమోదు చేసి టోకెన్లు పొందాల్సి ఉంటుందని, ఒకరోజు ముందుగానే (సోమవారం నుంచి) వీటిని తీసుకోవచ్చని పేర్కొన్నారు.