
219views
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని శివాలయం వద్ద జరిగిన తవ్వకాల్లో ఆళ్వారుల విగ్రహాలు బయట పడ్డాయి. పనుల నిమిత్తం గురువారం శివాలయం చుట్టూ ఉన్న మట్టిని తొలగించి ట్రాక్టర్‌తో ఊరి బయటపడేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు మూగన్న ఆ మట్టిలో ఉన్న 11 విగ్రహాలను గుర్తించి పక్కన పెట్టారు. పురావస్తు శాసన పరిశోధకులు శ్రీనివాసప్రసాద్ వాటిని పరిశీలించి, ఈ విగ్రహాలు 15, 16వ శతాబ్దాల కాలానికి చెందిన 11 మంది ఆళ్వారులవని తెలిపారు.





