News

జిహాదీలతో జాగ్రత్త : కన్వర్ యాత్రికులకు VHP అలర్ట్

242views

జాతీయ ఐక్యత, సామరస్యం, సమగ్రతకు ప్రతీక కన్వర్ యాత్ర అని విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు. కన్వర్ యాత్ర కోసం యూపీ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపట్టిందని ప్రశంసించారు. అయితే.. కవాడ్ యాత్రికులకు రాజ్యాంగం ద్వారా సంక్రమించే అన్ని హక్కులను కూడా ప్రభుత్వాలు కాపాడాలని సూచించారు.

ప్రతి సంవత్సరం దాదాపు 8 కోట్ల మంది యాత్రికులు ఈ పవిత్ర యాత్రలో పాల్గొంటారని జైన్ అన్నారు. ఈ యాత్ర విశ్వాసంతో పాటు జాతీయ ఐక్యత, సామరస్యం మరియు సమగ్రతకు చిహ్నంగా మారిందని పేర్కొన్నారు. ఈ యాత్రను సమాజంలోని అన్ని వర్గాలూ హృదయపూర్వకంగా స్వాగతించాలన్నారు. యాత్రికులు వెళ్లే మార్గంలో ప్రభుత్వంతో పాటు సమాజం కూడా తగిన ఏర్పాట్లు చేయాలని, కానీ.. కొన్ని సార్లు వారిపై దాడులు కూడా జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా యాత్రికులపై మాంసం ముక్కలు విసరడం, వారిని అపహాస్యం కూడా చేశారన్నారు. ఈ సమయంలో లౌకిక ప్రభుత్వాలు జిహాదీ దాడి చేసే వారికే మద్దతుగా నిలిచాయి కానీ.. ధర్మానికి మద్దతుగా నిలబడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే యూపీలో యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కన్వర్ యాత్ర విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. కొన్ని నియమాలు కూడా రూపొందిచారని, కొంత మార్పు కనిపిస్తోందన్నారు.అయితే జిహాదీలను కట్టడి చేస్తున్నారని, దీంతో కొత్త కొత్త దారులతో కన్వర్ యాత్రికులను జిహాదీలు ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఉమ్మి వేయడం, పండ్ల రసాల్లో మూత్రం కలపడం, వారి పేర్లను దాచేయడం, హిందూ పేర్లతో దుకాణాలు తెరవడం లాంటి పద్ధతులను అవలంబిస్తున్నారని, కన్వర్ యాత్రికులు చాలా జాగ్రత్తగా వుండాలని పిలుపునిచ్చారు.