
244views
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఖిల్కేత్ ప్రాంతంలో దుర్గాదేవి ఆలయంపై మతోన్మాదుల దాడిని భారత్ ఖండించింది. మతపరమైన తీవ్రవాదులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నారని ముందే తెలిసినా బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకపోగా ఆలయ విధ్వంసాన్ని చూస్తూ ఊరుకుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విమర్శించారు. హిందువులతోపాటు వారి ఆస్తులు, మందిరాలు, మత సంస్థలను కాపాడవలసిన బాధ్యత బంగ్లా ప్రభుత్వంపై ఉందన్నారు. వచ్చే ఏడాది భారత్-బంగ్లా గంగాజల పంపిణీ ఒప్పందాన్ని కొనసాగిస్తారా అని ప్రశ్నించగా సామరస్య వాతావరణం ఉంటే అన్ని అంశాలపై బంగ్లాతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని జైస్వాల్ చెప్పారు.





