News

పురాతన వినాయక విగ్రహం అపహరణ

292views

అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలంలోని అతిగారిపల్లి బీసీ కాలనీ వద్ద పురాతన కాలం నాటి వినాయక విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు గ్రామస్తులు తెలిపారు. బీసీ కాలనీ ఇంగ్లీషు మీడియం స్కూల్‌ మధ్యలో ఈ వినాయక విగ్రహం పురాతన కాలం నాటిదన్నారు. రోజూ భక్తులు అక్కడ పూజలు చేసేవారని తెలిపారు. త్వరలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని చందాలు కూడా వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ తరుణంలో రాత్రి వేళలో విగ్రహాన్ని అపహరించారు. ఈ విగ్రహాన్ని జడవారిపల్లి రూటు వరకు ఈడ్చుకొని వెళ్లి అక్కడి నుంచి వాహనంలో తీసుకెళ్లినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ విగ్రహం చోరీపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.