News

విజయవాడలో పూరీ జగన్నాథ రథయాత్ర

338views

పూరీ జగన్నాథ ఆలయానికి ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉంది. భక్తులు అత్యంత పవి త్రంగా ఈ ఆలయాన్ని చూస్తారు. పూరీ జగన్నాధ రథయాత్ర అంటే ఓ ప్రత్యేకం. అశేష భక్తజన వాహిని ముందుకు కదులుతుండగా సాగే రథయాత్ర నయనమనోహరంగా ఉంటుంది. స్వామి రథోత్సవ వైభోగాన్ని కనులారా సెకనుపాటు చూసినా మానవజన్మ తరిస్తుందన్న నమ్మిక. పూరీ జగన్నాథ ఆలయానికి వైష్ణవాలయాల్లో చార్ ధామ్లో ఒకటిగా పరిగణనలో ఉంది. జగన్నాథుడి రూపంలోనే సాక్షాతూ శ్రీ మహా విష్ణువు ఇక్కడ కొలువై ఉన్నాడని ప్రగాడ విశ్వాసం. ఈ నెల 27వ తేదీన పూరీలో జగన్నాథుని రథోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో దేశమంతటా వైష్ణవ భక్తులచే రథయాత్రలు జరుగుతుంటాయి. అలాగేన క్రమం తప్ప కుండా విజయవాడ నగరంలోనూ ప్రతి ఏడాది ఇస్కాన్ ఆధ్వర్యంలో రథ యాత్రలు జరుగుతుంటాయి. ఈ ఏడాది కూడా రథయాత్ర నిర్వహించేందుకు ఇస్కాన్ ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే ఈ సారి అమరావతి రథ యాత్ర పేరుతో నిర్వహించనుంది. వన్ టౌన్ లోని సితార జంక్షన్ నుంచి సీతమ్మ పాదాల వరకు యాత్ర నిర్వహించనున్నారు. ఈ రధయాత్రకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నట్టు నిర్వాహకులు తెలిపారు.