News

పహల్గామ్ దాడిపై ప్రజావగాహన కలిగిస్తున్న కాలిఫోర్నియాలోని బే ఏరియా బిల్‌బోర్డ్

168views

ఇటీవల కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది హిందువుల హత్య తర్వాత, కాలిఫోర్నియాలోని బే ఏరియాలోని ఒక డిజిటల్ బిల్‌బోర్డ్ పాకిస్తాన్‌ను ఉగ్రవాదంతో ముడిపెడుతున్న స్పష్టమైన సందేశంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

శాన్ మాటియో వంతెన సమీపంలో ఉన్న ఈ బిల్ బోర్డు, అమెరికాకు చెందిన లాభాపేక్షలేని సంస్థ యునైటెడ్ హిందూ కౌన్సిల్ (UHC) నిర్వహిస్తున్న ప్రజా అవగాహన ప్రచారంలో ఒక భాగం. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఏప్రిల్‌లో జరిపిన దాడి ‘మతపరంగా లక్ష్యంగా చేసుకున్న స్వభావాన్ని’ ప్రముఖంగా చూపించడమే దీని లక్ష్యం అని సంస్థ పేర్కొంది.

దానిపైన , “భారతదేశం మానవత్వానికి, పాకిస్తాన్ ఉగ్రవాదానికి అండగా నిలుస్తుంది. ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ వంటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద , అత్యంత వైవిధ్యభరితమైన ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంతో పోల్చవద్దు.” అనిరాసి ఉంది. అలాగే రహదారులపై ఉన్న బిల్ బోర్డుల పై మరోరకమైన ప్రశ్న రాసి ఉంది.: “పహల్గామ్‌లో బాధితులు హిందువులు కావడం వల్లే చంపబడ్డారు, కాబట్టి ఉగ్రవాదానికి మతం ఉందా?” అంటూ రాస్తూ ప్రజలకు దాడిపైన అవగాహన కలిగిస్తోంది ఆ సంస్థ. ఈ ప్రచార వీక్షకులను పహల్గామ్ హత్యలను డాక్యుమెంట్ చేసి, కాశ్మీరీ హిందువులపై జరిగిన హింస గురించి చారిత్రక అవలోకాన్ని అందించే వెబ్‌సైట్ www.PakistanTerrorism.com ని చూడమంటూ వారు సందేశాన్నిస్తున్నారు .

“కాశ్మీర్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ మౌనం ఆమోదయోగ్యం కాదు” అని యూహెచ్సీ ఒక ప్రకటనలో తెలిపింది. “పహల్గామ్‌లో మరణించిన వారి జ్ఞాపకాలను ప్రచారం లేదా రాజకీయ ప్రయోజనం కోసం తుడిచిపెట్టడానికి మేము అనుమతించము.”