News

శ్రీశైలంలో అహిల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలు

261views

చారిత్రక, సాంస్కృతిక, కట్టడాల జీర్ణోద్ధరణకు కృషి చేసిన గొప్ప పాలకురాలు అహల్యాబాయి హోల్కర్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో నిర్వహించిన అహల్యాబాయి త్రిశతాబ్ది ఉత్సవాలలో మంత్రి శనివారం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోమనాధ్ నుండి రామేశ్వరం వరకు దేశవ్యాప్తంగా వేలాది ఆలయాలు, సత్రాలు నిర్మించారని తెలిపారు. ఆమె స్ఫూర్తితోనే కేంద్రప్రభుత్వం మహిళా సాధికారత కోసం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.