News

అసాంఘిక శక్తుల ఆగడాలను అరికట్టండి

331views

విద్యల నగరమైన విజయనగరంలో అసాంఘిక శక్తులు తయారు కావడం చా లా బాధాకరమని..వీరి ఆగడాలను అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. అసాంఘిక శక్తులను అడ్డుకోవాలని కోరుతూ కలెక్టర్‌ అంబేడ్కర్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో ఉభయ రాష్ట్రాల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు వెలుగు చూసినా మూలాలు హైదరాబాద్‌ పాతబస్తీలో ఉండేవని గుర్తు చేశారు. ఇప్పుడు అటువంటి మూలాలు విజయనగరంలో ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నగరం మరో పాత బస్తీగా తయారు కావడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఉగ్రలింకులతో సంబంధం ఉన్న సిరాజ్‌ కుటుంబ సభ్యులపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.