News

బంగ్లాదేశ్‌లో హిందువులపై ముస్లింలు దాడి

318views

బంగ్లాదేశ్‌లోని జెస్సోర్ జిల్లాలోని మషిహతి గ్రామంలో, ముస్లింల గుంపు హిందువుల ఇళ్లకు నిప్పంటించింది. చేపల వేట వివాదంలో ఒక ముస్లిం మరణించిన తర్వాత హిందువులపై దాడి జరిగింది.

స్థానికుల కధనం ప్రకారం కిసాన్ దళ్ నాయకుడు తారీఖుల్ ఇస్లాం, చేపల పెంపకం కోసం నిర్మించిన చెరువు విషయం వివాదంలో తారీఖుల్ హత్యకు గురయ్యాడు. ఈ చెరువు గతంలో వేరొకరికి చెందినది; కానీ ఇప్పుడు తారీఖుల్ ఈ చెరువును తన ఆధీనంలోకి తీసుకున్నారని ఆ తరువాత జరిగిన వివాదంలో, తారిఖుల్ కాల్చి చంపబడ్డాడని చెప్పారు.

ఈ హత్యను సాకుగా చేసుకుని, ముస్లింలు మాసిహతి గ్రామంలోని హిందువుల ఇళ్లపై దాడి చేశారు. ముస్లిం గుంపు గ్రామంలోని 20 కి పైగా హిందువుల ఇళ్లకు నిప్పంటించింది, 4 దుకాణాలను ధ్వంసం చేసింది మరియు 2 దుకాణాలను తగలబెట్టింది. 6 వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ దాడిలో 10 మందికి పైగా హిందువులు గాయపడ్డారు. ముస్లింలు సాగర్ బిశ్వాస్ అనే యువకుడిని కూడా కిడ్నాప్ చేశారు.సంఘటన జరిగిన దాదాపు రెండు గంటల తర్వాత పోలీసులు, సైనిక అధికారులు మరియు అగ్నిమాపక దళం ఇక్కడికి చేరుకున్నారు.

ముస్లింల దాడి తరువాత, గ్రామంలోని చాలా మంది హిందూ పురుషులు తమ ఇళ్లను వదిలి పారిపోవలసి వచ్చింది. తారికుల్ హత్య కేసులో ఇంకా ఎలాంటి నేరం నమోదు కాలేదని అభయనగర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అబ్దుల్ అలీమ్ తెలిపారు.