News

రామ జన్మభూమిపై కంగన సినిమా

1kviews

లు విభిన్న పాత్రల్లో నటించి, ఎందరో ప్రేక్షకులను మెప్పించి బాలీవుడ్‌ క్వీన్‌గా పేరు తెచ్చుకున్నారు నటి కంగనా రనౌత్‌. ఇటీవల ఈ నటి ‘రాణీ ఆఫ్‌ ఝాన్సీ’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ నిర్మాణ సంస్థ ద్వారా ప్రేక్షకులను మెప్పించే చిత్రాలను తెరకెక్కిస్తానని ఆమె తెలిపారు. తాజాగా తన నిర్మాణ సంస్థలో చేయనున్న మొదటి సినిమా గురించి వివరించారు. ‘అపరాజిత అయోధ్య’ పేరుతో అయోధ్యలోని రామమందిరం మీద ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభంకానున్నట్లు తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కథను ‘బాహుబలి’ సృష్టికర్త విజయేంద్రప్రసాద్‌ రాస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

‘ఎంతో కీలకమైన అయోధ్య మీదనే ఎందుకు సినిమా తీయాలనుకుంటున్నారు?’ అని ఓ విలేకరి కంగనాను ప్రశ్నించగా ‘కొన్ని వందల సంవత్సరాల నుంచి రామమందిరం అనేది ఓ కీలక అంశంగా ఉంది. అయోధ్య కేసు దేశ రాజకీయాలను ఎంతగానో మార్చింది. అలాగే శతాబ్దాల నాటి ఈవివాదం భారతదేశంలోని లౌకిక స్ఫూర్తిని ప్రతిబింబించే తీర్పుతో ముగిసిపోయింది. ఓ నాస్తికుడు భక్తుడిగా ఎలా మారాడో చూపించేదే మా ‘అపరాజిత అయోధ్య’. ఓరకంగా ఈ సినిమా నా వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. నేను నిర్మాతగా తెరకెక్కించబోయే మొదటి సినిమాకు ఈ కథ బాగుంటుందని భావించాను.’ అని కంగన పేర్కొన్నారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.