News

వచ్చే ఏడాది ఇంగ్లీషు మీడియం మొదలు – జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

700views

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తదుపరి ఏడాది నుంచి ఒక్కో తరగతిలో ఆంగ్లమాధ్యమాన్ని పెంచుతామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆంగ్లమాధ్యమంపై ఉపాధ్యాయులకు శిక్షణ, హ్యాండ్‌ బుక్స్‌ బాధ్యతను ఎన్‌సీఈఆర్‌టీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌లో చేపట్టే ఉపాధ్యాయ నియామకాల్లో ఆంగ్లంలో ప్రావీణ్యం ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.