News

జ్ఞానపీఠ్‌ పురస్కారం స్వీకరించిన రామభద్రాచార్య

287views

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం 2023వ సంవత్సరానికి జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని ప్రముఖ కవి, సినీ గేయరచయిత గుల్జార్‌కు, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యకు అందజేశారు. 75 ఏళ్ల జగద్గురు రామభద్రాచార్య చిత్రకూట్‌లోని తులసీ పీఠ్‌ వ్యవస్థాపకుడు. ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక గురువు, సంస్కృత పండితుడు. 240కు పైగా గ్రంథాలు రాశారు. ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా నగదు పురస్కారం, సరస్వతి కాంస్య విగ్రహం అందుకున్నారు. సాహిత్యానికి, సమాజానికి రామభద్రాచార్య చేసిన సేవలను ముర్ము కొనియాడారు.రాంభద్రాచార్య దివ్య దృష్టి, జ్ఞానం మరియు సేవా స్ఫూర్తిని రాష్ట్రపతి ప్రశంసించారు. ఆయన శారీరకంగా అంధుడైనప్పటికీ, తన ఆధ్యాత్మిక దృక్పథంతో సమాజానికి, సాహిత్యానికి కొత్త వెలుగును అందించారని అన్నారు. ఆంక్షలు కాదు, దృఢ సంకల్పమే అతిపెద్ద బలం అని ఆయన జీవితం మనకు చెబుతుందని తెలిపారు.

రాంభద్రాచార్య ప్రతిస్పందిస్తూ, ఇది వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, సంస్కృత సాహిత్యానికి విజయం అని కూడా అభివర్ణించారు. “నా సాహిత్యానికి ఈ గౌరవం దక్కడం నాకు లభించిన గొప్ప అదృష్టం. వేల సంవత్సరాలుగా మన చైతన్యాన్ని రూపొందిస్తున్న సంప్రదాయానికి ఈ అవార్డు నివాళిని తెలిపారు.

మరో రచయత గుల్జార్‌ అనారోగ్య కారణాలతో ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు.గుల్జార్‌ అసలు పేరు సంపూర్ణ సింగ్‌ కాలరా. హిందీ సినిమాల్లో గొప్ప గేయరచయితగా పేరు తెచ్చుకున్నారు. అద్భుతమైన ఉర్దూకవుల్లో ఒకరిగా పేరుంది. 90 ఏళ్ల గుల్జార్‌ను కూడా అభినందించారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.