News

ప్రారంభమైన ఆంధ్ర ప్రాంత సంఘ శిక్షా వర్గ

483views

ఆంధ్ర ప్రాంత సంఘ శిక్షా వర్గ గుంటూరు జిల్లా నూతక్కిలోని విజ్ఞాన విహార స్కూల్ నందు మే 2 వ తారీఖున ప్రారంభం అయింది. ఈ శిక్షణ మే 17 వరకూ కొనసాగుతుంది. ఇందులో భాగంగా శిక్షార్థులు మే 11 న తెనాలి పట్టణ వీధుల్లో పథసంచలనం నిర్వహించారు. ఘోష్ నాదంతో స్వయంసేవకుల క్రమశిక్షాణాయుత పద విన్యాసంతో పట్టణం పులకించింది. పదసంచలనంలోని భగవద్వజం మీద పలు కూడళ్లలో మహిళలు పూలు చల్లి ఆహ్వానించారు.

శిక్షావర్గ వర్గాధికారిగా Y సాయేశ్వర రావు గారు..వర్గ కార్యవాహ గా శ్రీ బాబు గారు..వర్గ ప్రముఖ్ గా శ్రీ వేణుగోపాల నాయుడు గార్లు వ్యవహరించారు.అలాగే తెనాలిలో జరిగిన పద సంచలనాన్ని ప్రాంత కార్యవాహ్ శ్రీ వేణుగోపాల నాయుడు గారు పర్యవేక్షించగా ప్రాంత ప్రచారక్ శ్రీ ఆదిత్య గారు పరిశీలించారు..తెనాలిలో ఏర్పాట్లను నగర కార్యవాహ్ శ్రీ త్రిపురమల్లు హనుమత్ ప్రసాద్ గారు పర్యవేక్షించారు.