News

శబరిమలలో మహిళల వయోపరిమితి నిబంధన లింగ వివక్షతో కూడుకున్నది కాదు – ఆరెస్సెస్

655views

బరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి వయోపరిమితి నిబంధనను అనుసరించడం లింగవివక్షకు సంబంధించిన విషయం కానేకాదని ఆరెస్సెస్ అభిప్రాయపడింది. అది ఆ ఆలయంలో ఉన్న దేవత పూజావిధానానికి చెందిన విషయం మాత్రమేనని, కాబట్టి ఈ విషయంలో న్యాయస్థానాలు జరిపే ఎలాంటి పరిశీలన, సమీక్ష అయినా రాజ్యాంగం నిర్దేశించిన మత స్వేచ్ఛకు భంగకరమనే భావిస్తామని ఆరెస్సెస్ పేర్కొంది. ఇలాంటి విషయాల్లో దేవాలయ నిపుణులు, అధికారుల అభిప్రాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్ పేర్కొన్నారు.

అయితే పునస్సమీక్ష పిటిషన్ ను ఆమోదించి ఎక్కువమంది సభ్యులు కలిగిన బెంచ్ కు విషయాన్ని అప్పగించాలన్న సర్వోన్నత నాయస్థానపు నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.