News

శభాష్ ఆర్మీ.. వి.హెచ్.పి జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్

318views

పహల్గాం దాడికి బదులుగా ఆపరేషన్‌ సిందూర్‌ భారత్ చేపట్టడం చాలా ఆనందంగా ఉందని విశ్వ హిందూ పరిషత్ -వి.హెచ్.పి జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఆయన ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో అలోక్ కుమార్ మాట్లాడుతూ పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేయడం శుభ పరిణామమని,భారత్ ధర్మం, శాంతి కోసం పోరాటం చేస్తోందన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మెండుగా భారత్ పై ఉందని.. దేవుడే మనకు తోడుగా ఉన్నాడని పేర్కొన్నారు.