News

నీట్‌ రాసేందుకు వెళితే జంధ్యం తీయించారు

264views

నీట్‌ పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థి జంద్యం తొలగించిన ఘటన ఆందోళనకు దారితీసింది. కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా బసవకల్యాణ తాలూకా బెటబలగుంద గ్రామానికి చెందిన శ్రీపాదపాటిల్‌ కలబురగిలోని సెయింట్‌ మేరీ పాఠశాలలో నీట్‌ పరీక్షకు వెళ్లాడు. పరీక్ష కేంద్రంలో ప్రవేశించే సమయంలో జంధ్యం తొలగించాలని సూచించారు. దీంతో పరీక్షను కోల్పోవాల్సి వస్తుందని వెంటనే ఆ విద్యార్థి జంధ్యాన్ని తొలగించి, కేంద్రం వద్ద వేచివున్న తండ్రికి ఇచ్చి లోపలికి వెళ్లాడు. విషయం కాసేపటికే వైరల్‌ కావడంతో కలబురగిలోని బ్రాహ్మణులు ఆందోళనకు దిగారు. జంధ్యం తొలగించాలని సూచించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.