
కాశ్మీర్,విహారయాత్రకు వెళ్ళి పహల్గాం వద్ద తీవ్రవాదుల కిరాతకానికి ప్రాణాలు కోల్పోయిన,శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలి వాసి మధుసూదన్ కుటుంబాన్ని సోమవారం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ నాయకులు వారి ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఈ మేరకు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.


ఈ సందర్భంగా,మృతుని భార్య,పద్మావతి మాట్లాడుతూ, “కాశ్మీర్లో జరిగిన సంఘటన మా కుటుంబానికి నష్టం కలిగించినప్పటికీ, మతం పేరుతో మారణహోమం చేయటం క్షమించరాని నేరమని” అన్నారు. స్థానిక వ్యాపారులు కొందరు తప్పుదోవ పట్టించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగా శాంతి ఏర్పడి,పర్యాటకులు వస్తున్నారని ఆమె చెప్పారు.


ఆర్ఎస్ఎస్ మాననీయ ప్రాంత సంఘ్ చాలక్ శ్రీ హరికుమార్ రెడ్డి, ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ బయ్యా వాసు, నెల్లూరు మాననీయ విభాగ్ సంఘ్ చాలక్ శ్రీ పల్నాటి రామదండు, విభాగ్ కార్యకారిణి సభ్యులు శ్రీ బాలు సుబ్బారావులతో పాటు స్థానిక నేతలు మురళి, నగేష్ బాబు తదితరులు మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించారు.





