News

అయోధ్య దర్శనం కోసం 300 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కనపెట్టనున్న హనుమాన్ గఢీ అర్చకులు

273views

హనుమాన్‌గఢీ దేవాలయం ప్రధాన అర్చకుడు ‘గద్ది నషీన్‌’ మహంత్‌ ప్రేమ్‌ దాస్‌ (70) తన జీవితంలో మొదటిసారి ఈ గుడి, తన ఇంటి బయటకు రాబోతున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 30న ఆయన రామాలయంలో బాల రాముడిని దర్శించుకోనున్నారు. శతాబ్దాల నుంచి వస్తున్న ఆచార, సంప్రదాయాల ప్రకారం గద్దీ నషీన్‌ తన జీవితంలో ఈ గుడి, ఇంటి నుంచి బయటకు రాకూడదు. స్థానిక కోర్టులకు కూడా హాజరుకాకూడదు.

అయితే, తనకు శ్రీరాముడిని దర్శనం చేసుకోవాలనే కోరిక ఉందని మహంత్‌ ప్రేమ్‌ దాస్‌ నిర్వానీ అఖాడాకు తెలియజేయగా ఆమోదించింది. దీంతో ఆయన ఈ నెల 30న నాగ సాధువులు, శిష్యులు, భక్తులతో ఊరేగింపుగా వెళ్లి బాలరాముడిని దర్శించుకుంటారు.

70 ఏళ్ల మహంత్ ప్రేమ్ దాస్‌ ప్రస్తుతం ఈ ఆలయ ప్రధాన పూజారిగా ఉన్నారు. ఇన్నేళ్లలో ఆయన ఎన్నడూ గుడి ప్రాంగణాన్ని వీడలేదు. ఇటీవల ఆయన రామాలయాన్ని దర్శించాలనే కోరికను వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని నిర్వాణి అఖాడా దృష్టికి తీసుకెళ్లగా అక్కడి సభ్యులు దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.