News

పాకిస్తాన్‌లో హిందూ మంత్రిపై దాడి..

316views

పాకిస్తాన్‌లో హిందూ మంత్రి ఖీల్ దాస్ కోహిస్తానీపై దాడి జరిగింది. సింధ్ ప్రావిన్సులో పాక్ ప్రభుత్వం చేపడుతున్న కాలువ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్న నిరసనకారులు అతడిపై దాడి చేశారు. ఈ ప్రాజెక్టు నదుల దిగువ ప్రవాహాన్ని తగ్గిస్తాయని, ఫలితంగా సింధ్ ప్రాంతంపై ప్రభావం పడుతుందని అక్కడి ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, సింధ్ ప్రావిన్సు గుండా ప్రయాణిస్తున్న సమయంలో కోహిస్తానీపై దాడి జరిగింది.

ఈ దాడిని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. దాడికి పాల్పడినవారిని శిక్షిస్తామని చెప్పారు. పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం ఇటీవల ఓ భారీ కాలువ నిర్మాణాన్ని ప్రారంభించింది. దీని వల్ల దిగువ ప్రాంతమైన సింధ్‌కి రావాల్సిన నీటిని పంజాబ్ ప్రాంతానికి మళ్లిస్తున్నారని అక్కడి ప్రజలు నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే, పీఎం షెహబాజ్ షరీఫ్ మంత్రివర్గంలో మత వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్న కోహిస్తానీపై దాడి జరిగింది. ఆయన సింధ్ ప్రావిన్స్ తట్టా జిల్లా గుండా వెళ్తున్నప్పుడు టమోటోలు, బంగాళాదుంపలతో నిరసనకారులు దాడి చేశారు. ఈ దాడిలో కోహిస్తానీ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.