
752views
హైదరాబాద్ లోని గౌలిగూడలోని శ్రీరామ మందిరం నుంచి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడ నుంచి కోఠి, నారాయణగూడ బైపాస్ మీదుగా సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు ఈ ర్యాలీ సాగనుంది. భక్తులు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు. 12 కిలోమీటర్ల యాత్రకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ గౌలిగూడలోని శ్రీరామ మందిరానికి చేరుకుని భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.
కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నుంచి వీర హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. సైదాబాద్, మాదన్నపేట మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది.





