News

కాశ్మీర్ ఉగ్రవాదంపై పాక్‌ని మందలించిన సౌదీ

393views

పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఐఎస్ఐ చీఫ్ అసిమ్ మాలిక్, విదేశాంగ కార్యదర్శి అమ్నా బలోచ్ ఇటీవల సౌదీ అరేబియాలో పర్యటించారు. సౌదీ, యూఎస్ అధికారులతో పాక్ అధికారులు సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. బలూచిస్తాన్‌లో బీఎల్ఏ ట్రైన్ హైజాక్ ఘటన, ఇతర దాడుల తర్వాత వీరంతా సౌదీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే, ఈ సమావేశంలో పాకిస్తాన్‌ని సౌదీ అరేబియా, అమెరికాలు మందలించినట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన పాకిస్తాన్ జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్ చెబుతున్న దాని ప్రకారం..

కాశ్మీర్ ఉగ్రవాదంపై మందలింపు:
కాశ్మీర్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్తాన్‌ని సౌదీ, యూఎస్ తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి కృ‌షి చేయడంతో పాటు భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని పాకిస్తాన్‌ని ఇరుదేశాలు కోరాయి. జమ్మూ కాశ్మీర్‌లో భారత్ సార్వభౌమత్వాన్ని అంగీకరించాలని పాకిస్తాన్‌కి చెప్పినట్లు సమాచారం.

ఈ డిమాండ్లు నెరవేర్చకుంటే పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌పై ట్రావెల్ బ్యాన్‌తో సహా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది. పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక కార్యక్రమాలకు సాయం చేయాలని అమెరికా కోరింది.