News

భారతీయ సంస్కృతి సంరక్షణే లక్ష్యం

202views

భారతీయ సంస్కృతి సంరక్షణే ధ్యేయంగా ఎన్‌ఎస్‌యూ పనిచేస్తోందని వీసీ జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి తెలిపారు. జాతీయ సంస్కృత వర్సిటీ ఉత్కల పరిషత్‌, తెలుగు విభాగం, వేమ భూపాల కళాపరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో కల్చరల్‌ ఇంటిగ్రేషన్‌, ప్రమోషన్‌, సంస్కృతి అధ్యయనంలో భాగంగా ఉత్కల దివస్‌ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డిప్యూటీ సిటీ ప్లానర్‌ సంపూర్ణానంద మహాపాత్రతో కలసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. వర్సిటీలో ఒడిశా విద్యార్థులు అధికంగా ఉన్నారని, భారతీయ సంస్కృతి ఇంటిగ్రేషన్‌, పరస్పర అధ్యయనం వంటి విషయాలలో వర్సిటీ కృషి ప్రశంసనీయమన్నారు.