
ఢిల్లీలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. మతం మారడానికి ససేమిరా అంగీకరించకపోవడంతో కోమల్(22) అనే హిందూ యువతిని మహ్మద్ ఆసిఫ్ దారుణంగా హత్య చేశాడు.అంతేకాకుండా ఆమె మృతదేహాన్ని బండరాయికి కొట్టి, కాలువలో పడేశాడు.అయితే.. మార్చి 12 న చివరి సారిగా కోమల్ కనిపించింది. ఆ తర్వాత అదృశ్యమైపోయింది. చివరికి ఈ నెల 17న ఆమె మృతదేహాన్ని చావ్లా కాలువ నుంచి వెలికితీశారు.
ఢిల్లీ పోలీసులు చెప్పిన కథనం ప్రకారం… కోమల్ ను క్యాబ్ డ్రైవర్ ఆసిఫ్ అత్యాచాం చేసి, గొంతు కోసి చంపేశాడని తెలిపారు. మతం మారాలని కోమల్ పై తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడని, మతం మారి, తనను పెళ్లి చేసుకోవాలని కూడా ఒత్తిడి తెచ్చేవాడని తెలిపారు. కానీ… కోమల్ ససేమిరా అంగీకరించలేదని పేర్కొన్నారు.అయితే.. నాలుగేళ్లుగా ఆసిఫ్ తనకు తెలుసని, ఎప్పుడైతే మతం మారమని, తనను పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టసాగాడో.. అప్పటి నుంచి కోమల్ కాస్త దూరం పాటించేదని కూడా తెలిపారు. ఆసిఫ్ డిమాండ్లను కోమల్ ఒప్పుకోలేదని, దీంతో తన స్నేహితుడు జుబేర్ తో కలిసి ఆసిఫ్ అత్యాచారం చేశాడని, ఆ తర్వాత చంపేసి, మృతదేహాన్ని కాలువలో పడేశారని తెలిపారు. కోమల్ మృతదేహాన్ని తాళ్లతో కట్టి, ఓ రాయితో బరువుగా చేసి, కాలువలోకి విసిరేశారని పేర్కొన్నారు. అయితే.. కోమల్ ఇరుగు పొరుగు వారితో మాట్లాడేదని తెలుసుకొని, మరింత కోపం పెంచుకున్నాడని కూడా తెలుస్తోంది.
అయితే బాధితురాలి కుటుంబం ఫిర్యాదులు చేయడానికి కూడా చాలా ఆపసోపాలు పడినట్లు సమాచారం. ఈ నెల 12 న అంగద్ నగర్ లోని కాల్ సెంటర్ లో ఆఫీస్ ముగించుకొని కోమల్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబీకుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఫోన్ కూడా సైలెంట్ లోకి వెళ్లిపోయింది. ఏదో హాని జరిగిందని కుటుంబం నిర్ధారణకు వచ్చింది. దీంతో పోలీసుకు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. కానీ… వేరే పీఎస్ లో ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పారు. అయితే కోమల్ ఇంటి పొరుగున వున్న మహ్మద్ నయీమ్ ఖాన్ కుటుంబం వీరికి సహకరించింది. బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. దీంతో చివరికి సీమాపురి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల ఉదాసీనతే బాధిత కుటుంబానికి నచ్చడం లేదు. మార్చి 14 న వారిని సంప్రదించామని, హోళీ తర్వాత కలవాలని పోలీసులు చెప్పారని వాపోయారు.
ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 12 న కోమల్ ఆఫీస్ తర్వాత ఓ తెల్లకారులో వెళ్లామని తెలిపింది. తనను దిల్షాన్ గార్డెన్ దగ్గర దింపేసి, కోమల్ అదే కారులో వెళ్లిపోయిందని వెల్లడించింది. దీంతో కేసులో పురోగతి దొరికింది. సీసీటీవీలను పరిశీలించారు. ఈ నెల 17 న అసలు విషయం బయటపడింది.





