
301views
కర్నూలు జిల్లా మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్ర స్వామి మఠంలో 2000 మందికి పైగా భక్తులతో శ్రీ రామనామ జపం కార్యక్రమం నిర్వహించారు. మార్చి 1 తేదీ నుంచి 6 వరకు శ్రీమఠంలో నిర్వహించిన గురువైభవోత్సవాలల్లో భాగంగా రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో నాదనమనె కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి భాగంగా దేశం నలుమూలాల నుంచి వచ్చిన భక్తులు, ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి 2000 మందికి పైగా మహిళా భక్తులతో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ప్రాకారంలో శ్రీరామనామ జపం గీతాలను ఆలపించారు. 16 కు పైగా శ్లోకాలతో శ్రీరాముని మహిళా భక్తుల కీర్తించారు. రామనామ జపంతో శ్రీమఠం తుంగతీరం పరవశించిపోయింది. ఈ కార్యక్రమం దాదాపు రెండు గంటల పాటు కొనసాగుతుంది.





