
2019, ఫిబ్రవరి 14… ఈ దేశం, దేశభక్తులు ఎన్నటికీ మరిచిపోలేని తేదీ. జమ్మూ కశ్మీర్ లోని పుల్వామాలో ఇస్లామిక్ ఉగ్రదాడి జరిగింది. అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటి. ఈ దాడిలో 40 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. దీని బాధా, ఆవేదన ఇప్పటికీ భారతీయుల మనస్సులలో తాజాగా అలాగే వుంది.
సీఆర్పీఎఫ్ కాన్వాయ్ జమ్మూ నుంచి శ్రీనగర్ జమ్మూ కశ్మీర్ జాతీయ రహదారిపై శ్రీనగర్ వైపు వెళ్తోంది. ఇంతలో అవంతిపోరాలోని గోరిపోరా ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 40 మంది జవాన్లు వీర మరణం పొందారు.
జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్ దగ్గర నుంచే ఓ వాహనం వెళుతోంది. తమ కాన్వాయ్ కి దూరంగా జరగమని సైనికుడు పదేపదే కోరుతున్నాడు. కానీ… అవతలి వాహనదారుడు పట్టించుకోలేదు. సైనికులకు అర్థమయ్యే లోపలే ఆ కారు కాన్వాయ్ ని ఢీకొట్టింది. ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది.దీనిలో ఓ ఇస్లామిక్ ఉగ్రవాది కూడా మరణించాడు. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు జైషే మహ్మద్ అనే ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈ పేలుడు చాలా ప్రమాదకరం. దాని శబ్దం కొన్ని కిలోమీటర్ల మేర వినిపించింది. ఆ సమయంలో పుల్వామా ప్రాంత పరిసరాల్లో మంటలు, పొగలు అలుముకున్నాయి.
పుల్వామా దాడి జరిగిన 12 రోజుల తర్వాత ఇస్లామిక్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ కి భారత్ గట్టి గుణపాఠమే చెప్పింది. కఠిన చర్యలు అవలంబించింది. 2019, ఫిబ్రవరి 26 న భారత వైమానిక దళం పాకిస్తాన్ లోని బాలాకోట్ లోకి ప్రవేశించి, వైమానిక దాడులతో పాక్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. 300 మంది ఇస్లామిక్ ఉగ్రవాదులను సైన్యం హత మార్చి ప్రతీకారం తీర్చుకుంది.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం వైమానిక దళానికి చెందిన 2 వేల విమానాలు ఆ ప్రాంతంలోని ఇస్లామిక్ ఉగ్రవాదుల శిబిరాలపై సుమారు 100 కిలోల బాంబులను జారవిడిచాయి. ఇంత జరిగినా పాక్ కి తెలియదు. ఈ దాడికి బాలాకోట్ ఎయిర్ స్టైక్స్ అని పేరు.
సరిగ్గా ఇదే సమయంలో MIG 21 యుద్ధ విమాన పాకిస్తాన్ f16 ఫైటర్ జెట్ నుకూల్చేసింది. ఈ దాడిలో MIG21 యుద్ధ విమానం దెబ్బతిన్నది. దాడికి గురై, అక్కడే పడిపోయింది. ఈ సమయంలోనే పాక్ సైనికులు MIG 21 పైలట్ అభినందన్ వర్ధమాన్ ని పట్టుకున్నారు. అభినందన్ ను విడిచిపెట్టాలని అమెరికాతో పాటు పలు దేశాలు పాక్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. దీంతో 2019, మార్చి ఒకటిన పాక్ అభినందన్ వర్ధమాన్ ను విడుదల చేసింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం అభినందన్ ను ‘‘వీర చక్ర’’ అన్న పురస్కారంతో సత్కరించింది కూడా.
పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ అప్పటి వరకూ పాక్ తో నెరుపుతున్న వాణిజ్య సంబంధాలను పూర్తిగా రద్దు చేసుకుంది. దీంత పాక్ చాలా నష్టపోవాల్సి వచ్చింది. పాక్ ను బ్లాక్ లిస్టులో చేర్చేందుకు మనీలాండరింగ్ పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ను కూడా భారత్ కోరింది.





