News

ప్రజాశక్తి పత్రికకు ప్రముఖుల బహిరంగ లేఖ

262views

బహిరంగ లేఖ:

ప్రజాశక్తి దినపత్రిక యాజమాన్యమా?

మీ అసత్యాల జర్నలిజంను మార్చుకోరా?

కొద్ది రోజుల క్రితం భాగ్యనగర చిలుకూరు,శ్రీ వేంకటేశ్వర దేవాలయం అర్చకులు డా.రంగరాజన్ గారి ఇంట్లోకి వెళ్లి, వాద వివాదాలు పెట్టుకుని వారి పై పిడిగుద్దులు వీర రాఘవ రెడ్డి బృందం చేసింది. వెంటనే తెలంగాణ RSS ప్రచార విభాగం ఈ దాడిని ఖండిస్తూ ప్రకటన చేసింది.ఈ దుర్ఘటన ప్రచార సాధనాల్లో ప్రచారం జరిగింది. డా.రంగరాజన్ గారు నాలుగు సంవత్సరాల కిందట హైదరాబాద్ పాత బస్తీలో, గుంటూరులో, నెల్లూరులో ముని వాహన వాహన సేవను (దళితుడిని భుజంపై ఎక్కించుకుని దేవాలయ ప్రవేశం) చేసారు.అంటరానితనం నిర్మూలన వారి లక్ష్యం.ఈ మూడు చోట్లా ఆర్.ఎస్.ఎస్., సామాజిక విభాగం సామాజిక సమరశత వేదిక కార్యకర్తలు పూర్తిగా పాలుపంచుకున్నారు.తరువాత సామాజిక సమరసత వేదిక అనేక కార్యక్రమాల్లో డా.రంగరాజన్ గారు పాల్గొన్నారు.

1) దాడి చేసిన వీర రాఘవ రెడ్డి ఆర్ఎస్ఎస్ పరివార సంస్థల వ్యక్తి కాదు.

2) డా.రంగరాజన్ గారు తమపై ఆర్ఎస్ఎస్, పరివార సంస్థల వారు దాడి చేశారని ఎక్కడైనా, ఎవరితోనైనా అన్నారా? ఆర్ఎస్ఎస్ పరివార సంస్థల వారే డా. రంగరాజన్ గారిపై దాడి చేశారని మొదటిసారి… డా.రంగరాజన్ గారి ప్రగతి శీలక కార్యక్రమాల పట్ల వ్యతిరేకతతో వీరే దాడి చేశారని ప్రజాశక్తి రెండు అసత్య కథనాలను వ్రాసింది. ఈ కథనాలకు సాక్ష్యం ఏమి ఉంది?

హైదరాబాద్ పాత బస్తీలో మునివాహన సేవను డా రంగరాజన్ గారు చేస్తే అమెరికాలో ఉన్న పూజ్య శ్రీ దలైలామా శ్లాఘిస్తూ ప్రకటన చేశారు. మీరు మీ ప్రజాశక్తి పత్రికలో పొగుడుతూ వార్త రాసారా?

మీరు వ్రాసిన కథనాలను ఉపసంహరించుకుంటూ వెంటనే ప్రకటన చేయండి. తెలుగునాట ప్రజాశక్తికి సుదీర్ఘ చరిత్ర ఉంది. అనేక మంది పాత్రికేయులకు జన్మ నిచ్చారు. మీ ఏక పక్ష, అసత్య, ప్రజా వ్యతిరేక విధానాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో మీరు పరపతిని కోల్పోయారు. ఇలాగే మీ పద్ధతులు కొనసాగిస్తే ఇంకా ప్రజా మద్దతును కోల్పోతారు.

జాతీయ సంస్థలు కోల్పోయేది ఏమీ ఉండదు. వార్తను సత్యాలతో వార్తగా రాయాలి. వార్తలో ఎర్ర కళ్లద్దాల వ్యాఖ్యానాలు చొప్పించకూడదు. తప్పులు చేయడం మామూలు. సవరించుకోవడం విజ్ఞత.

1)శ్యాం ప్రసాద్, జాతీయ కన్వీనర్, సామాజిక సమరసత, హైదరాబాద్

2) దుగ్గరాజు శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు, విజయవాడ

3) రామకృష్ణ,ఎడిటర్,అగ్ని

4) ఎ.జయప్రకాష్,సీనియర్ పాత్రికేయులు, నెల్లూరు.

5) సన్నిధానం శాస్త్రి,సీనియర్ పాత్రికేయులు, రాజమండ్రి

6) రాకా సుధాకర్, సీనియర్ పాత్రికేయులు,హైదరాబాద్