News

బంగ్లా తిరుగుబాటుకు త్వరలో అధికారిక ముద్ర

300views

బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వ కూల్చివేతకు దారితీసిన తిరుగుబాటుకు అధికారిక ముద్ర వేస్తూ ‘జులై తిరుగుబాటు ప్రకటన’ (డిక్లరేషన్)ను చేయాలని తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలందరి ఏకా భిప్రాయంతో, అందరి భాగస్వామ్యంతో కొద్ది రోజుల్లో ఈ పత్రం సిద్ధమవుతుందని బంగ్లాదేశ్ ముఖ్య సలహా. దారుకు పత్రికా విభాగ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న షఫీఖుల్ ఆలమ్ ప్రకటించారు. ప్రజల్లో ఐకమత్యాన్ని బలోపేతం చేయడాన్ని, ఫాసిస్టు విలువల్ని భూస్థాపితం చేయడాన్ని, తిరుగుబాటు ద్వారా రాజ్య సంస్కరణ జరుగుతున్న తీరును ఈ పత్రం ప్రతిబింబిస్తుందని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం తెలిసిన అనంతరం విద్యార్థులు అత్యవసర సమావేశం నిర్వహించి ఐక్యతా ర్యాలీ నిర్వహించారు. ముజీబ్ వాదాన్ని భూస్థాపితం చేయం డంటూ నినాదాలు చేశారు. బంగ్లాదేశ్లో విద్యార్థుల తిరుగుబాటు సందర్భంగా ఎందరో ప్రదర్శనకారుల మృతికి కారకులైన నాటి ప్రభుత్వ పెద్దలకు శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.