News

చిన్మయ్‌ కృష్ణదాస్‌ అరెస్ట్‌.. స్పందించిన పవన్‌ కల్యాణ్‌

214views

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ ప్రచారకులు చిన్మయ్‌ కృష్ణదాస్‌ అరెస్ట్‌ను రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఖండించారు. దీనిపై కలసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ మేరకు పవన్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. హిందువులను లక్ష్యంగా చేసుకున్న తీరు తమను తీవ్రంగా కలచివేస్తోందని పేర్కొన్నారు. హిందువులపై అఘాయిత్యాలను ఆపాలని బంగ్లాదేశ్‌ ప్రభుత్వ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్‌కు విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భారత సైన్యం రక్తం చిందించిందని.. దేశ వనరులు ఖర్చవడంతో పాటు మన ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని పవన్‌ పేర్కొన్నారు.